Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సిపిఎం నేతల అక్రమ అరెస్టు…. విడుదల

మోతే : రైతాంగానికి మద్దతు ధరల చట్టం చేయాలని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని, ఎండి పోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో ని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాకు వెళుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, సిపిఎం మండల కమిటీ సభ్యులు చర్లపల్లి మల్లయ్య, దోస పాటి శ్రీనివాస్, జంపాల స్వరాజ్యం ను పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేసి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అన్నారు. రైతాంగానికి మద్దతు ధరల చట్టం చేయాలని కోరుతూ చలో ఇందిరా పార్కు నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ నాయకత్వాన్ని అరెస్టు చేయడానికి ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని అన్నారు.

Related posts

అంబేద్కర్ ఆశయాలను ఆచరిద్దాం -రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు

TNR NEWS

ఉపాధ్యాయులకు ప్రతి నెల ఫస్ట్ కు వేతనాలు ఇవ్వాలి నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు సన్మానం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలి

TNR NEWS

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

Harish Hs

ప్రజలందరి దేవుడు అంబేద్కర్

TNR NEWS

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

TNR NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS