Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది ఆవార్డు

  • ఆవార్డు పట్ల పలువురు హర్షం

 

పిఠాపురం : సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది అవార్డు లభించింది. బంగారుతల్లి లఘుచిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు రచించినందుకు శ్రీ విఘేశ్వర ఆర్ట్ సొసైటీ నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో భాగంగా నంది అవార్డుతో రచయిత డా॥ సునీల్ కుమార్ యాండ్రను హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. గత 4నెలల క్రితం శ్రీవిశ్వకర్మ క్రియేషన్స్, ఆర్.కె.క్రియేటివ్స్, జి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన బంగారు తల్లి లఘుచిత్రంలో టిక్టాక్ స్టార్ దుర్గారావు దంపతులు, చైల్డ్ ఆర్టిస్ట్ మంజూశ్రీ, నటులు ఆర్.కె, దాకే సింహాచలం, బాబి, సూరిబాబు, పెద్దాడ వెంకటేశ్వరరావు, ఇతర నటీనటులు నటించిన బంగారు తల్లి లఘుచిత్రం కోమటి రామకృష్ణ్ట (ఆర్.కె) దర్శకత్వం వహించగా టిక్టాక్ స్టార్ దుర్గారావు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యిన అతి కొద్ది కాలంలోనే సుమారు లక్ష్యా 80వేల మంది ప్రేక్షకుల తిలకించి విశేష ఆదరణ కనబరిచారు. ఈ సంధర్భంగా నంది ఆవార్డు గ్రహీత డా॥ సునీల్ కుమార్ యాండ్ర మాట్లాడుతూ ఈ ఆవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ సొసైటీ ఫౌండర్ ఛైర్మన్ బండారి శ్రీధర్ నానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది సంధర్భంగా ఆవార్డు ప్రధానం చేయడం జరిగిందని, ఈ ఆవార్డు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, వెండితెర, బుల్లితెర నటుడు జెమిని సురేష్, నటులు దిల్ రమేష్, బి.హెచ్.ఈ.ఎల్.ప్రసాద రావు, సినీయర్ దర్శకులు బాబ్జి, నిర్మాత ముసాఆలీఖాన్, మోడల్ సృజన, జూనియర్ పవన్ కళ్యాణ్, జూనియర్ చంద్రబాబు, సుమిత్ మీడియా సిఈఓ వంశీకృష్ణల చేతుల మీదుగా తీసుకోవడం జరిగిదన్నారు. బంగారు తల్లి చిత్రానికి దర్శకత్వం వహించిన డా॥ కోమటి రామకృష్ణకు కూడా ఉత్తమ దర్శకుడిగా ఆవార్డు లభించిందన్నారు. ఈ సంధర్భంగా డా॥ సునీల్ కుమార్ కు  పిఠాపురం పట్టణ ప్రముఖులు, రాజకీయనాయకులు, స్నేహితులు, పాత్రికేయ మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

అలరించిన శ్రీ కృష్ణుడి లీలలు – అభినందించిన డా. ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

గత అయిదేళ్లలో రాష్ట్రంలో నీటిశుద్ధి ఫిల్టర్ బెడ్లను మార్చిన పాపాన పోలేదు*

TNR NEWS

మార్చి 22న ‘ఎర్త్ అవర్’ పాటించండి – గవర్నర్ అబ్దుల్ నజీర్

Dr Suneelkumar Yandra

పాడా తాత్కాలిక భవన ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

Dr Suneelkumar Yandra

పిర్ల సూర్యనారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరనిలోటు – జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు