Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

వడ్డాది నుండి గంధవరం వరకు ఆర్ & బి రహదారి పునర్నిర్మాణం పనులు కొద్దిరోజుల్లోనే ప్రారంభం

పిఠాపురం : దీర్ఘకాలిక సమస్య అయిన వడ్డాది నుండి  గంధవరం వరకు ఉన్న ఆర్ & బి రహదారి పునర్నిర్మాణం ఆలస్యం అవడం వలన క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ దృష్టికి  చోడవరం జనసేన పార్టీ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు తీసుకువెళ్లారు. అనకాపల్లి కార్యాలయంలో పార్లమెంటు సభ్యులను కలసి ఈ రహదారి దుస్థితి వలన ప్రజలు పడుతున్న ఇక్కట్లు, తరచు జరుగుతున్న ప్రమాదాలవలన అనేకమంది తీవ్ర గాయాలు పలగడం, ప్రాణాలు కోల్పోవడాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్లారు. వెనువెంటనే సిఎం రమేష్ ఆర్ & బి శాఖ ఉన్నత అధికారులతోను మరియు కాంట్రాక్ట్ తీసుకొన్న కంపెనీ యజమాన్యంతోను సుధీర్గంగా చర్చించి వెంటనే రహదారి నిర్మాణం పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన కాంట్రాక్టు యాజమాన్యం రెండు వారాల్లో పనులు ప్రారింభిస్తామని తెలియచేసారు. ఈ ప్రధాన సమస్యపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న సిఎం రమేష్ కి చోడవరం నియోజకవర్గ ప్రజల తరఫున జనసేన పార్టీ కృతజ్ఞతలు తెలియచేస్తుందన్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు డి.పరమేశ్వరరావు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

యూరియా కొరతతో రైతులు ఆందోళన… సొసైటీలు వద్ద సరుకు కోసం పడిగాపులు

Dr Suneelkumar Yandra

ఓటర్ ఐడి కిఆధార్ అనుసంధానం పట్ల హర్షం

Dr Suneelkumar Yandra

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS

భక్తి శ్రద్ధలతో శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra

ఏపీలో వాహనదారులకు పోలీసుశాఖ షాక్ – రేపటి నుంచి భారీ జరిమానాలు

ఉచిత కంటి వైద్య శిబిరము పోస్టర్ ఆవిష్కరణ