తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గులాబీ జెండా ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవారం చలో వరంగల్ పోస్టర్ను మాజీ ఎంపీపీ లింగాల నిర్మల నివాసంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపింది గులాబీ జెండాయనని పేర్కొన్నారు.
లక్షలాదిగా తరలివెళదాం
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దా మన్నారు. ఈ నెల టిఆర్ఎస్ రజదోత్సవ మహాసభలకు బెజ్జంకి మండలం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలను తరలించాలని రసమయి బాలకిషన్ కోరాడు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కనగండ్ల తిరుపతి, మాజీ ఎంపీపీ లింగాల నిర్మల, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, ఎలా శేఖర్ బాబు, శంభు పెద్ద లింగారావు, తిప్పారపు మహేష్ తదితరులు పాల్గొన్నారు