Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జూలై 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో మహిళలోకం వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని ఐద్వారాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన ఐద్వా సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతంగా అమలు చేయాలని భావిస్తున్నదని అన్నారు. అందులో భాగంగానే కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని వేగవంతం చేస్తున్నదని ఆరోపించారు.ఇది అమల్లోకి వస్తే భారత కార్మిక వర్గం త్యాగాలతో సాధించుకున్న హక్కులన్నీ, హరించబడతాయని, కార్మికులకు ఎలాంటి చట్టాలు హక్కులు లేకుండా చేసి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితోపాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటీకరణకు అప్పగించి కార్పొరేట్, పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా లేబర్ కోడ్లలో వారికి అనుకూలంగా చట్టాలను మార్చడం జరిగిందన్నారు.నాలుగు లేబర్ కోడ్ లో పారిశ్రామిక సంబంధాల కోడ్ వేతనాల కోడ్ వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ సామాజిక భద్రత కోడ్లుగా రూపొందించారని ఉన్నారు.ఇందులో కనీస వేతన నిర్ణయాన్ని ప్రభుత్వాల యాజమాన్యాల దయ దక్షిణాన వరకు వదిలేశారని అన్నారు. నాలుగు లేబర్ కోడ్లు అమలు అయితే కార్మికులు కార్మిక సంఘలు పెట్టుకునే హక్కును కోల్పోతారని చెప్పారు.కనీస వేతనాలు ప్రమాద భద్రతలు ఉద్యోగ భద్రత అడిగే హక్కులను పూర్తిగా హరించిపోతాయని అన్నారు. కార్మికులు పనిచేయాలంటే యాజమాన్యాల యొక్క దయా దక్షిణాల పైన ఆధారపడి పని చేయాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులను నిరుద్యోగులకు ప్రయోజనం కలిగించే విధంగా కాకుండా కేవలం గుత్తాపెటబడిదారులకు, యాజమాన్యాలకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ చట్టాలను తీసుకొస్తా ఉందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ జులై 9 నాడు జరిగే సార్వత్రిక సమ్మెకు ఐద్వా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, ఈ సమయంలో మహిళలోకం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగేళ్ల వెంకట చంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మద్దెల జ్యోతి, జిల్లా నాయకురాలు జూలకంటి విజయలక్ష్మి, మేకన బోయిన సైదమ్మ, షేక్ కాతీజ, బచ్చల కూర మంగమ్మ, నెమ్మాది లక్ష్మి, యానాల సుశీల, సుందరి రమ పాల్గొన్నారు.

Related posts

బీజేపీ పార్టీలో చేరికలతో జోరుమీదున్న నల్లబెల్లి మండలం – *జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

TNR NEWS

మహిళా సంఘ డైరెక్టర్ గా ఆవుల విజయలక్ష్మి

TNR NEWS

అన్ని బంధాల కంటే స్నేహబంధం ఎంతో విలువైనది మహర్షి డిగ్రీ కళాశాలలో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు 

TNR NEWS

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత

Harish Hs

నూతన ఆలయాన్ని ప్రారంభించినసింగరేణి సంస్థ సిఎండి శ్రీ ఎస్ బలరాం

TNR NEWS

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరణ. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

TNR NEWS