Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోదాడ నియోజకవర్గ ప్రజలకు తొలి ఏకాదశి,మొహర్రం శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

మొహర్రం,తొలి ఏకాదశి పండుగల సందర్భంగా కోదాడ నియోజకవర్గ ప్రజలకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.హిందువులకు ఎంతో ప్రత్యేకమైన తొలి ఏకాదశి పండుగ రోజు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తున్న భక్తులందరికీ ఆ భగవంతుడు ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.మొహర్రం పర్వదినాన ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.మొహర్రం పండుగ త్యాగం,స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు.విశ్వాసం, నమ్మకం కోసం మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకోవడమే మొహర్రం ప్ర‌త్యేక‌త అని స్ప‌ష్టం చేశారు.మానవ జాతిలో త్యాగం ఎంతో గొప్పదని, మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే ఈ వేడుకకు నిజమైన అర్థమని అన్నారు. ఇస్లాంలో ముఖ్యమైన మానవతా వాదాన్ని ప్రతిబింబించే మొహర్రం స్ఫూర్తిని అనుకరిద్దామని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చెప్పారు.

Related posts

మాస్టర్ మైండ్స్ పాఠశాలలో గణిత దినోత్సవం 

TNR NEWS

బివిఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం

Harish Hs

కన్నుల పండువగా అయ్యప్ప మహా పడిపూజ

TNR NEWS

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్

Harish Hs

*రైతాంగానికి ఏమి చేశారని సంబరాలు…..?*   *కేంద్రం డి ఏ పి ధరలు తగ్గించాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

TNR NEWS

“సమయ సద్వినియోగంతో సత్ఫలితాలు”

Harish Hs