అట్టడుగు వర్గాల అభ్యున్నతి, దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ జగ్జీవన్ రామ్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరపయ్య అన్నారు. ఆదివారం జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతవానికి విశేష సేవలు అందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను సాధించాలన్నారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు అని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గంధం పాండు, సైదాబాబు, గంధం రామకృష్ణ, కర్ల కాంతారావు, శ్రీనివాసరావు, బుచ్చారావు, బొబ్బిలి తదితరులు పాల్గొన్నారు………

previous post