కోదాడ పట్టణంలో అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువుకున్న 2000-2001 బ్యాచ్ కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కోదాడ పట్టణం లోని ఓ ఫంక్షన్ హల్ లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. చాలా ఏండ్ల తర్వాత పాఠశాల పూర్వ విద్యార్థులంతా ఒకచోట కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆనాటి తీపి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ప్రస్తుతం ఎవరెవరు ఏ ఏ వృత్తిలో స్థిరపడ్డారో తెలుసుకుంటూ ఆనందంగా గడిపారు……..