సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అధ్వర్యంలో షీ టీమ్ సిబ్బంది చిలుకూరు మండల కేంద్రంలో గల MITS కళాశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భగా కోదాడ షీ టీమ్ ఎస్ ఐ మాధురి మాట్లాడుతూ.. విద్యార్థులకు షీ టీమ్ అంటే ఏమిటి మరియు అది ఎలా పని చేస్తుంది, అది వారికి ఎలా ఉపయోగపడుతుంది, ఈవ్ టీజింగ్,సోషల్ మీడియాలో వేధింపులను గురించి, మహిళల అక్రమ రవాణా, బాలల దుర్వినియోగం, బాల్య వివాహాలు,బాల కార్మికులు, చైల్డ్ లైన్ 1098, బోండెడ్ లేబర్, పోస్కో చట్టం గురించి, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్, యాంటీ-ర్యాగింగ్, సెల్ఫ్ డిఫెన్స్, సైబర్ క్రైమ్, ఎక్కడైనా సమస్యలు ఉంటే అత్యవసరంగా సంప్రదించదానికి *100 డయల్* మరియు షీటీమ్ నంబర్ 8712686056 గురించి అవగాహన కల్పించడం జరిగింది. *షీ టీమ్స్* మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇది ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న వేధింపులపై ప్రత్యేక దృష్టి సారిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో షి టీమ్ మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి , పాఠశాల ఉపాధ్యాయనిలు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు…