యువ న్యాయవాది యాతాకుల క్రాంతి మరణానికి సంతాప సూచికగా మంగళవారం నాడు కోదాడ కోర్టులో జడ్జిలు *కోర్టు రిపరెన్స్ పోగ్రాం* నిర్వహించారు.
ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్ మాట్లాడుతూ క్రాంతి మంచి భవిష్యత్తు ఉన్న యువ న్యాయవాదన్నారు.ఆమె అకాల మరణం ఆమె కుటుంబానికి తీరని లోటన్నారు.ఆమె చిన్నప్పటి నుండి లాయర్ కావాలనే ఆలోచనతో చదివి,ఇంకాఎంతో స్థాయికి ఎదగాలని కోరుకున్నారని కానీ అర్ధంతరంగా అనారోగ్యంతో మరణించడం భాధాకరమన్నారు.అడ్వకేట్స్ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. ముందుగా ఒక నిముషం మౌనం పాటించి,*జడ్జిలు 30 నిముషాలు పెన్ డౌన్* చేసి ఘన నివాళులు అర్పించారు. *తర్వాత బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు* ఈ సభకు అధ్యక్షత వహించిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు ch *లక్ష్మీనారాయణ రెడ్డి* మాట్లాడుతూ క్రాంతి తండ్రి కోర్టు ఉద్యోగం చేస్తూ కూతురు ఉన్నత చదువులు చదివించారని,ఆమెను కోర్టు ఆఫీసర్ గా చూడాలనుకున్నప్పటికి చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమన్నారు.ఆమె కుటుంబానికి బార్ అసోసియేషన్ అండగా ఉంటుందని చెప్పారు. ఆమె మరణానికి సంతాప సూచికగా ఈ రోజు *అడ్వకేట్స్ వర్క్ సస్పెండ్* (న్యాయవాదులు ఈ రోజు పని చేయకుండా వుంటారు) చేస్తున్నామన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ *ఘనంగా నివాళులర్పించారు*. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య, కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు వై సుధాకర్ రెడ్డి, ఎస్ రాధాకృష్ణ మూర్తి,మేకల వెంకట్రావు, టి హనుమంతరావు,ఎస్.శరత్ బాబు, చింతకుంట్ల రామిరెడ్డి, గట్ల నర్సింహారావు,ఈ దుల కృష్ణయ్య,వి రంగారావు, రంజాన్ పాషా,కొండల్ రెడ్డి, వెంకటేశ్వరరావు,సుధాకర్,వెంకటేశ్వర్లు,రమేష్ బాబు,కరీం,హుస్సేన్, నవీన్,చలం,మురళి,కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.