వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు పేర్కొన్నారు.బుధవారం మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక హెల్త్ సెంటర్ ను జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే హాజరు పరిశీలించారు. ఫార్మసీ స్టోర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.హాస్పటల్లో ఓపీ సేవలు పెంచే విధంగా సిబ్బంది కృషి చేయాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సూచించారు.ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు వ్యాధి నిర్ధారణ చేసి వెంటనే చికిత్స అందించాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు సంబందించిన మందులు పూర్తి స్థాయిలో ఆసుపత్రిలో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి డాక్టర్ రవీందర్,స్టాఫ్ నర్స్ జ్యోతి శ్రీ,సూపర్వైజర్ శ్రీనివాస్,ఫార్మలాజిస్ట్ స్వాతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు,ఆశా వర్కర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.