పచ్చని చెట్లను పెంచితేనే మానవాళికి ప్రాణవాయువు అందుతుందని కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి అన్నారు. బుధవారం పట్టణంలోని శ్రీనగర్ కాలనీ ప్రైమరీ స్కూల్ లో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడు ట్రస్టు సభ్యుడు చారుగండ్ల రాజశేఖర్ వెంటి లెటర్ తో ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి కిట్టు, పైడిమర్రి సతీష్,పందిరి సత్యనారాయణ, షేకు శ్రీనివాసరావు, వెంపటి ప్రసాద్, మహంకాళి హుస్సేన్, పబ్బ గీతా, రమణ,సాయి, తదితరులు పాల్గొన్నారు………

previous post