Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ‌‌

మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రయాణ సమయంలో జాగ్రత్త వహించాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..ముఖ్యంగా వాహనదారులు, రైతులు, ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు,ముట్టుకోకుండా, అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రయాణ సమయంలో రోడ్లు, వంతెనలు తెగిపోయిన రాకపోకలకు ఆటంకాలు ఎదురైతే పోలీస్ అధికారులకు తెలపాలని కోరారు. చెరువులు, వాగులు, కుంటలు, నీటితో నిండి ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహించినప్పుడు వాటిని దాటే సాహసం చేయరాదన్నారు.పాత పాడుబడ్డ ఇళ్లలో నివసించరాదని,బావుల వద్ద జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు 100 కాల్ చేస్తే ప్రత్యేక సేవలు అందించేందుకు పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉంటారని తెలిపారు.

Related posts

అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ పథకాలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS

57వ జాతీయ వారోత్సవాలకు హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

TNR NEWS

దళితులు అనే నెపంతో తొలగించడం ముమ్మాటికి కుల వివక్షతే కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున

TNR NEWS

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తొలి రోజు పరీక్ష మొత్తం 2343 మందికి 2339 మంది హజరు …. నలుగురే గైర్హాజరు

TNR NEWS

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

TNR NEWS

యోగ మనిషి జీవనంలో మార్పు తెస్తుంది…సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్.

Harish Hs