మండల పరిధిలోని వివిధ కేసుల్లో పట్టుబడిన నాలుగు ద్విచక్ర వాహనాలను శనివారం ఉదయం 11 గంటల సమయంలో చేవెళ్ల ఎక్సైజ్ పోలీసు స్టేషన్ కార్యాలయం నందు జిల్లా ప్రొహిబిషన్ అధికారి సమక్షంలో బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నామని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టు ఆదేశానుసారం డిస్పోజల్ కమిటీ సూచన మేరకు వాటిని ఆర్టీవో వాల్యుయేషన్ తర్వాతనే ఈ వేలం వేయడం జరుగుతుందని అన్నారు. ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొనవచ్చునని, వాహనాలకు సంబంధించి పూర్తి వివరాలకు స్థానిక ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.