Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లో సాంఘీక సంక్షేమ బాలుర పాఠశాల / కళాశాల,గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలికలు పాఠశాలల ను సందర్శించి తరగతి గది, వంటశాల, ఆహారం నాణ్యత, బియ్యం నాణ్యత ను, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో భోజనం అందించాలని, ఆహారం తయారు చేసే సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల పఠన సామర్థ్యం, ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుక దేవి, ఆర్ డి ఓ వాసు చంద్ర,తహసిల్దార్ వెంకటేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

TNR NEWS

*ట్రాఫిక్ నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలి : DSP జి.రవి.*  *సూర్యాపేట కొత్తబస్టాండ్ వద్ద సాయంత్రం సమయంలో ట్రాఫిక్ నియంత్రణను ఆకస్మికంగా తనిఖీచేసిన DSP రవి.*

TNR NEWS

కోదాడ రామాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ రజిత రెడ్డి ప్రత్యేక పూజలు

TNR NEWS

మదీనా తుల్ ఉలూమ్ మదర్సా స్వర్ణోత్సవాలు జయప్రదం చేయాలి…….  కోదాడలో గత 50 ఏళ్లుగా ఆధ్యాత్మిక, సామాజిక విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న మదీనా తుల్ ఉలూమ్ మదర్సా……. జనవరి 4న పూర్వ విద్యార్థుల సమ్మేళనం….. జనవరి 5న భారీ బహిరంగ సభ….మదీనా తుల్ ఉలుమ్ మదర్స స్వర్ణ ఉత్సవాలకు హాజరుకానున్న ఆధ్యాత్మిక గురువులు………

TNR NEWS

కాల్వశ్రీరాంపూర్ మండల కార్యాలయం లో ఘనంగా గనతంత్ర వేడుకలు

TNR NEWS

ఘనంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు

TNR NEWS