Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మాజీ ఎంపీ నామ చేతుల మీదుగా నూతన ఫార్మా రిటైల్ అవుట్‌లెట్ ప్రారంభం ప్రజలకు అందుబాటు ధరలకు నాణ్యమైన మందులు అందించాలి – మాజీ ఎంపీ నామ

ఖమ్మం నగరం, మయూరి సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలైట్ ఎస్2 ఫార్మా హోల్‌సేల్-రిటైల్ ఫార్మా అవుట్‌లెట్ ను బుధవారం నాడు బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ లోక్‌సభ సభ్యులు నామ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, మాజీ డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరలకు నాణ్యమైన మందులు అందించే సంకల్పంతో ఈ ఫార్మా ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఎలైట్ ఎస్2 ఫార్మా డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ (కెపి) మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన ఈ ఔషధ షాప్ ద్వారా మూడు రాష్ట్రాల్లో నాణ్యమైన మందులను అందించనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కంపెనీలతో భాగస్వామ్యంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవల కొరకు మందులు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ అవుట్‌లెట్‌లో డిస్కౌంట్ మెడిసిన్స్‌తో పాటు, ఆరోగ్య సంబంధిత పరికరాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా నామ, తాతా మధు, సండ్ర వెంకట వీరయ్య లు షాపులో ఏర్పాటు చేసిన మందుల విభాగాలను పరిశీలించి యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ ఎస్2 ఫార్మా సిబ్బందితో పాటు బిఆర్ఎస్ నాయకులు కనకమేడల సత్యనారాయణ, బిఆర్ఎస్ వైరా రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి, నాయకులు మోతారపు సుధాకర్, మోరంపూడి ప్రసాద్ రావు, బత్తుల శ్రీనివాసరావు, గొడ్డేటి మాధవరావు, మరికంటి రేణుబాబు, వాకదాని కోటేశ్వరరావు, ఎదునూరి శ్రీను, బిఆర్ఎస్ యువత భాస్కర్, నాగేశ్వరరావు, షారుక్ లతో ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు

TNR NEWS

మూడవ జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ

Harish Hs

మాస్టర్ మైండ్స్ పాఠశాలలో గణిత దినోత్సవం 

TNR NEWS

ఐఏఎల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

జగిత్యాల జిల్లా యువకుడు గ్రూప్-3, గ్రూప్-1లో ప్రతిభ కనబర్చాడు

TNR NEWS

గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

Harish Hs