TG: సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో బుధవారం ఆయన్ను ఈడీ ఐదు గంటలపాటు విచారించింది. దీనిపై ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. విచారణలో భాగంగా బెట్టింగ్స్ యాప్స్ నిర్వాహకుల నుంచి డబ్బులు అందలేదని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. ఇక నుంచి బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయనన్నారు. కాగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయనకు పది రోజుల క్రితం ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే