Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అన్నదానం మహా పుణ్య కార్యం.తహసిల్దార్ చంద్రశేఖర్,ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్

అన్ని దానాలలో కెల్లా అన్నదానం మహా పుణ్య కార్యం అని,పండుగలు ఉత్సవాలు జాతరల సందర్భంగా అలాంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు.సోమవారం మండల కేంద్రంలోని స్థానిక చెరువు గట్టు నందు మడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల సందర్భంగా,మునగాల గ్రామానికి చెందిన ఉత్తమ్ పద్మావతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు తొంగంటి వేలాద్రి హైమావతి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని కావున ప్రతి ఒక్కరం ఎదుటివారి ఆఖరి తీర్చేందుకు అన్నదానం నిర్వహించడం గొప్ప విషయం అని

దేవాలయ ఉత్సవాల సందర్భంగా 1500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన తొగంటి వేలాద్రి హైమావతి దంపతులను, మరియు మడేలేశ్వర స్వామి దేవాలయం కమిటీ సభ్యులను వారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మునగాల పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, దేవాలయ విగ్రహాల దాత కందకట్ల శ్రీనివాసరావు, దేవాలయ కమిటీ అధ్యక్షులు, తంగేళ్ల నాగేశ్వరరావు, ముక్కోళ్ల వెంకటేశ్వరరావు, దేవాలయ కమిటీ సభ్యులు రజక సంఘం సభ్యులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related posts

పతంగుల కోసం చైనా మాంజా వాడకం ప్రమాదకరం‌

Harish Hs

సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేసిన మంత్రి కొండా సురేఖ, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

TNR NEWS

కానిస్టేబుల్ శీను పరామర్శించిన టిపిసిసి డెలిగేట్

Harish Hs

కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్న అమలు కానీ ఆరు గ్యారంటీలు – రేవంత్ రెడ్డికి హరీష్ రావును ఎదుర్కునే దమ్ము లేదు  – గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి

TNR NEWS

క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి

TNR NEWS

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

TNR NEWS