Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*కమ్యూనిస్టుల పోరాట ఫలితమే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణం…*   *శ్రీరామ్ సాగర్ రెండవ దశకు మాజీ పార్లమెంటు సభ్యులు* *కమ్యూనిస్టు నేత భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి.*   *మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు ఇతర దేనికి పెట్టిన మాకు అభ్యంతరం లేదు…*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

సూర్యాపేట: శ్రీరామ్ సాగర్ రెండవ దశ కు మాజీ పార్లమెంటు సభ్యులు కమ్యూనిస్టు నేత భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని, మాజీ మంత్రివర్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఇతర దేనికి పెట్టిన మాకు ఎలాంటి అభ్యంతరం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన జిల్లా ప్రజా సంఘాల బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ రెండో దశ నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా పోరాటాలు జరిగాయని, ఆ పోరాటంలో మిర్యాలగూడ మాజీ పార్లమెంటు సభ్యుడిగా కమ్యూనిస్టు నాయకుడుగా ఉన్న భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ప్రాజెక్టు సాధన కోసం విశేష కృషి చేశారని అన్నారు. అధికారం ఉన్నదని నెపంతో కమ్యూనిస్టుల పోరాటాన్ని భీమ్ రెడ్డి నరసింహారెడ్డి త్యాగాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి ఆలోచన గుర్తించకుండా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండ ఏకపక్షంగా శ్రీరామ్ సాగర్ రెండవ దశకు మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టడం సమంజసం కాదన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సిపిఎం, వామపక్షాలు దశాబ్దాలుగా పోరాటం చేశాయన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పై పోరాడి ఒప్పించి మెప్పించి భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ప్రగతి నగర్ వద్ద శంకుస్థాపన చేయించారని అన్నారు. తాను చనిపోయేంతవరకు గోదావరి జలాలు తాగుతానని పదే పదే బిఎన్ చెప్పేవాడన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో పార్లమెంటులో, బయట అనేక ప్రజా పోరాటాలు దశాబ్దాల పాటు నిర్వహించామన్నారు. ఆ ప్రాజెక్టు సాధన కోసం భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, మల్లు వెంకట్ నరసింహారెడ్డి ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేయడం మూలంగా అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తి,సూర్యాపేట ప్రాంతాలకు నీరు అందించాలని గుర్తు చేశారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా ఈ ప్రాంతం సస్యశ్యామలమై రైతులు సంతోషంతో వ్యవసాయాన్ని చేసుకుంటున్నారనిఅన్నారు. స్వర్గీయ భీమిరెడ్డి నరసింహారెడ్డి తాను ఎంపీగా ఉన్న సందర్భంలో అనేకసార్లు పార్లమెంటులో తన వాయిస్ ని వినిపించడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేకసార్లు శ్రీరాంసాగర్ రెండవ దశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయడం జరిగిందన్నారు. శ్రీరామ్ సాగర్ రెండో దశ నిర్మాణం చేపట్టడంలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని దానికి నాయకత్వం వహించిన భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును నామకరణం చేయాలని కోరారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం భీమ్ రెడ్డి నరసింహారెడ్డి పేరు పెడతామని చెప్పి మోసం చేసిందన్నారు. గతంలో బి ఎన్ వర్ధంతి సందర్భంగా వివిధ వేదికలపై మాజీ మంత్రి జానారెడ్డి, ఇతర కాంగ్రెస్ పెద్దలు సైతం భీంరెడ్డి నరసింహారెడ్డి పేరు పెడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల తుంగతుర్తి లో జరిగిన మాజీ మంత్రివర్యులురామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పేరు పెట్టాలనడం దురదృష్టకరమని విమర్శించారు. మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరును జిల్లాలో దేనికి పెట్టిన తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అలా కాకుండా ఎంతో పోరాట చరిత్ర కలిగిన శ్రీరాంసాగర్ రెండవ దశకు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టడాన్ని జిల్లా ప్రజానికం వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ విషయమై పునర్ ఆలోచన చేసి ఇతర దేనికైనా మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్, జె.నరసింహారావు, మద్దెల జ్యోతి, ప్రజా సంఘాల నాయకులు ఎం రాంబాబు, మడ్డిఅంజిబాబు, షేక్ జహంగీర్, చిన్నపంగా నరసయ్య, కాసాని కిషోర్, ఉప్పుల రమేష్ పాల్గొన్నారు.

Related posts

నూతన ఆలయాన్ని ప్రారంభించినసింగరేణి సంస్థ సిఎండి శ్రీ ఎస్ బలరాం

TNR NEWS

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు

Harish Hs

రవీంద్ర ప్లే స్కూల్లో అంబరానంటిన బాలల దినోత్సవ వేడుకలు

TNR NEWS

ఓదెల లో లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు ఓదెల గ్రామం మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో

TNR NEWS

కార్పొరేట్ అనుకూల బడ్జెట్… బడ్జెట్ లో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతుల ప్రయోజనాలకు మొండి చేయి.. బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసిన సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

TNR NEWS

బాపూజీ గ్రంథాలయం ఎదుట బీఈడీ అభ్యర్థుల నిరసన

TNR NEWS