Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దైవత్వాన్ని పరిచయం చేసే త్రైత సిద్ధాంత భగవద్గీత

టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ

 

 

మూఢత్వంలో ఉన్న మానవుడిని త్రైత సిద్ధాంత భగవద్గీత దైవత్వం వైపుకు తీసుకెళ్తుందని ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ అధ్యక్షుడు పోటు వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలో ఇంటింటికి తిరిగి త్రైత సిద్ధాంత గ్రంథాలను పరిచయం చేశారు. తుమ్మితే అపశకునం, కన్ను అదిరితే అపశకునం, ఏదో పని నిమిత్తం బజారుకు వెళ్తుంటే భర్త లేని స్త్రీ ఎదురువస్తే అపశకునం, చెట్టుకు పూజ, పుట్టకు పూజ, జంతువుకు పూజ, రాయికి పూజ ఇలా ఏం చేస్తున్నామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియకుండా మూఢంగా ప్రవర్తిస్తున్న మానవులకు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత గ్రంథాలు అంధకారం నుంచి దైవత్వంలోకి తీసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. జగద్గురువుగా పేరు ఉన్న శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానబోధ ఏ కులానికో, ఏ ప్రాంతానికో పరిమితం కాకుండా జగత్తు అంతటికి వర్తించే బోధగా ఉంటుందని ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు అసలైన వివరణ తెలిపాడన్నారు. ఆధ్యాత్మిక రంగంలో ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంతం ఆధారంగా భగవద్గీత, బైబిల్, ఖుర్ ఆన్ లతో పాటు 100కు పైగా గ్రంథాలు రచించి దేవుడు (సృష్టికర్త) గురించి వివరించాడన్నారు. కుల, మతాల కొట్లాటల్లో మునిగిపోయిన అజ్ఞానులకు అమృతాన్ని సిద్ధింపజేసే విధంగా త్రైత సిద్ధాంత గ్రంథాలు జ్ఞానశక్తితో ప్రకాశిస్తున్నాయని వివరించారు. మన పూర్వీకులు ఏ ఉద్దేశ్యంతో పండుగలు అనే పేరుతో ప్రత్యేక దినాలను ఏర్పాటు చేశారో మన పండుగలు గ్రంథం చదివితే తెలుస్తుందన్నారు. మన పూర్వీకులు దేవాలయ వ్యవస్థను ఏ ఉద్ధేశ్యంతో నిర్మించారు, దేవాలయాల వల్ల మనకు కలిగే ఉపయోగం ఏమిటో తెలుసుకోవాలంటే దేవాలయాల రహస్యాలు గ్రంథం చదవాలని కోరారు. శిశువు పుట్టిన వెంటనే చేటలో పడుకోబెట్టడం, మనిషి చనిపోయినప్పుడు కర్మఖాండ తంతు ఎందుకు చేస్తారో ఈవిధముగా పుట్టిన దగ్గర నుంచి చావు వరకు మనిషి జీవితకాలంలో జరిగే ప్రతి వెనుక పెద్దలు ఏర్పాటుచేసిన రహస్య విషయాలను ఇందూ సాంప్రదాయాలు గ్రంథంలో ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వివరించాడన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ త్రైత సిద్ధాంత గ్రంథాలు చదివి ధర్మం గురించి తెలుసుకోవాలని కోరారు. ఇంటింటి ప్రచారంలో వంగాల మహేష్, విజయ, జాస్తి శివరామకృష్ణ, నరసింహారావు పాల్గొన్నారు.

Related posts

బిసి విద్యార్థి సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడి నియామకం

Harish Hs

మద్దూర్ లో గణనాథుల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

TNR NEWS

సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

Harish Hs

బెజ్జుర్ మండలతహసీల్దార్ కు ఘోర అవమానం

TNR NEWS

పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవు

TNR NEWS

పది లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నా జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి

TNR NEWS