Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
చరిత్రతెలంగాణ

విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి….. అదనపు కలెక్టర్ డి.వేణు మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్

 

పెద్దపల్లి;

విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని అదనపు కలెక్టర్ డి.వేణు అన్నారు.సోమవారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

*అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ,* స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్ట మొదటి నెహ్రూ నాయకత్వంలోని క్యాబినెట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు, ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు.

హిందీ అరబిక్ బెంగాలీ ఇంగ్లీష్ భాషలలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పండితుడని, 11 ఆ సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పని చేశారని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలని ఆశయంతో కులమత బేధాలు లేకుండా పని చేశారని అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1992 లో భారతరత్న అవార్డు అందజేసి గౌరవించిందని ఆదాపు కలెక్టర్ పేరు కొన్నారు. పేదరికం విద్యతో మాత్రమే దూరమవుతుందని భావించి ప్రతి పేదవాడికి విద్య అందే దిశగా చర్యలు తీసుకున్నారని అన్నారు. వ్యక్తిగతంగా మతపరమైన సంప్రదాయాలు పాటిస్తూ మనమంతా భారతదేశంలో భాగమని తెలిపారని అన్నారు.మన రాష్ట్రంలో ప్రభుత్వం మైనారిటీ విద్యపై దృష్టి పెడుతూ గురుకులాలను ఏర్పాటు చేసిందని, ప్రత్యేకంగా మైనారిటీ బాలికల విద్య పై దృష్టి సారించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇక్కడ అన్ని కులాలు వర్గాల వారు కలిసి చదువుకుంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థులకు గణిత ప్రతిభా పరీక్షలు

TNR NEWS

గొర్రెల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి.  చనిపోయిన గొర్రెకు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.  జి *ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్

TNR NEWS

ఎర్నేని బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య

Harish Hs

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ

TNR NEWS

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs