టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ
ప్రభుత్వ విద్యను ప్రజల హక్కుగా మలిచింది భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ నందు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు.దేశానికి స్వాతంత్ర్యం అనంతరం తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా సమైక్య భారతావానికి ఎనలేని కృషి చేశారని వారి సేవలను కొనియాడారు. విద్యార్థులు వారి ఆశయాల సాధనకై కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జాకీర్ కార్యదర్శి అబ్దుల్ గఫార్,ఖాజా మియా, ఖన్నం సాహెబ్,జబ్బార్, ముక్తార్, శ్రీనివాస్ రెడ్డి,బడుగుల సైదులు, పాండురంగ చారి,బ్రహ్మచారి,దేవరాజ్, బ్రహ్మానందం,రామకృష్ణ, రవి, జానకి తదితరులు పాల్గొన్నారు………..