- రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి. రాంబాబు అన్నారు. మంగళవారం మునగాల మండల పరిధిలోని బరకత్ గూడెం లోని పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. నిర్వాహకులకు ఎఫ్ఏ క్యూబ్ ప్రకారం కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా రైతులతో మాట్లాడారు.. ప్రభుత్వం సన్నధాన్యంకు మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ ఇస్తుంది అన్న విషయాన్ని తెలియపరిచారు, కావున రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరియు గ్రామంలోని సోషియో ఎకనామిక్ సర్వే కూడా పరిశీలించారు. వీరి వెంట రెవిన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ ,ఏవో రాజు,ఆర్ ఐ రామారావు ,మరియు పి ఎస్ ఎస్ సీఈఓ బసవయ్య పాల్గొన్నారు.
previous post