డిసెంబర్ 1న మంచిర్యాల లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు 25 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మెట్ పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీలలో జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 980 మంది విద్యార్థులు పాల్గొనగా మున్సిపల్ కమిషనర్ రణవేని సుజాత జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఉత్తమ క్రీడాకారులకు రణవేణి నితిన్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మెరిట్ సర్టిఫికెట్స్ తో పాటు మెడల్స్ బహుకరించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ తరపున పోటీలలో పాల్గొన్న క్రీడాకారులందరికీ సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్ బాబు అసోసియేషన్ సెక్రెటరీ ఏలేటి ముత్తయ్య రెడ్డి, ఉపాధ్యక్షులు గజెల్లి రాందాస్, కొమురయ్య, ఆల్ రౌండర్ గంగాధర్, శంకర్, కార్తీక్, అశోక్, ప్రశాంత్, రవళి, మధులిత తదితరులు పాల్గొన్నారు.