Tnrnews.in
తెలంగాణ

TG UUEU రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

 

దౌల్తాబాద్: సిద్దిపేటలో జరిగే జనవరి 4, 5 వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సుధాకర్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని ముబారస్ పూర్ సబ్ స్టేషన్ లో దౌల్తాబాద్, రాయపోల్ మండలాల సెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్తులో వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పద్మనాభం, ఉపాధ్యక్షులుగా సత్తిరెడ్డి, రవీందర్, ప్రధాన కార్యదర్శిగా నజీర్, కోశాధికారిగా రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా గణేష్, అంజద్, సహాయ కార్యదర్శులుగా పృద్వి, సత్తయ్య, రాజు, కరుణాకర్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి రామగోని రవికుమార్ గౌడ్, జిల్లా జాయింట్ సెక్రెటరీ యాదగిరి యాదవ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యాదగిరి గౌడ్, నాయకులు శ్రీమాన్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వెంకట్రామ పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కీ త రమేష్ 

TNR NEWS

అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది

TNR NEWS

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS

ఓదెల మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఆవరణలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు  పుట్టినరోజు వేడుకలు

TNR NEWS

కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే 

Harish Hs

ఏసీబీ వలలో కోదాడ ఫారెస్ట్ బీట్ అధికారి

Harish Hs