కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తమ్మిశెట్టి రాజేష్ తన స్వంత ఖర్చులతో తన ఫోటోతో ముద్రించిన టీషర్ట్ లను శనివారం వాలీబాల్ క్రీడాకారులకు పంపిణీ చేశారు.మానకొండూర్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి సంపత్ గౌడ్,కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నందగిరి రవి చేతుల మీదుగా క్రీడాకారులకు టీషర్ట్ లను అందజేశారు.కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొత్తకొండ శంకర్,గసిగంటి సంపత్,యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కోండ్ర సురేష్,మైనారిటీ సెల్ నాయకుడు ఎండి.తాజొద్దీన్,చెంజర్ల గ్రామ శాఖ అధ్యక్షుడు గొల్లెన కొమురయ్య,ముక్కెర సతీష్,సురేష్ పాల్గొన్నారు.