Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఎన్నాళ్లో వేచిన ఉద్యోగం నెల రోజులు అయినా నిలవని ఆనందం

ఎంతో పోరాటం, ఎంతో శ్రమ, ఎంతో ఓర్పుతో, 45 సంవత్సరాల వయస్సు మీద పడినప్పటికీ మొక్కవోని ధైర్యంతో పట్టువదలని విక్రమార్కుడి లా డీఎస్సీ 2024 కి ప్రిపేర్ అయ్యి, సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాన్ని పొందాడు.

 

జీవితంలో ఇక తనకు రాదనుకున్న ఉద్యోగాన్ని సాధించినందుకు తనతో పాటుగా భార్య పిల్లలు కూడా సంబరాల్లో మునిగిపోయారు.

 

కానీ, విధి వక్రీకరించింది..

 

దురదృష్టం అతని కుటుంబాన్ని వెంటాడింది..

 

మొదటి నెల జీతం అందుకోకుండానే

 

ఆ జీతం డబ్బులతో తన కుటుంబాని కి పండ్లు, స్వీట్ కొని ఇవ్వకుండానే..

తన తల్లిదండ్రులకి తోబుట్టువులకి బట్టలు పెట్టకుండానే..

 

యాక్సిడెంట్ రూపంలో అతన్ని కబళించింది!!

 

ప్రాన్ నెంబర్ కోసం మూడు రోజుల క్రితం అతను నాతో ఫోన్లో మాట్లాడిన మాటలు నా చెవుల్లో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి..

 

అతని గొంతు ఇంకా నాకు వినపడుతూనే ఉంది..

 

తను అడిగిన ప్రాన్ నెంబర్ సమస్య పరిష్కారం అయినప్పటికిని, ప్రభుత్వ నిబంధనలలో స్పష్టత లేకపోవడంతో మొదటి నెల జీతం అందుకోకుండానే ఈరోజు ఉదయం యాక్సిడెంట్ లో చనిపోయిన డీఎస్సీ 2024 నూతన ఉపాధ్యాయుడు ఉపేందర్ గారి మృతి నన్ను బాధిస్తుంది!

Related posts

విద్యుత్ ఘాతంతో రైతు మృతి

Harish Hs

ఆర్యవైశ్యులు సంఘటితంగా ఉండాలి

TNR NEWS

కోలాహలాంగా ప్రారంభమైన పోలీసు క్రీడా పోటీలు

TNR NEWS

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

Harish Hs

సామజిక,ఆర్థిక,అసమానతలకు విరుగుడు విద్యే నల్గొండలో సావిత్రి బాయిపులే జయంతి పాలడుగు నాగార్జున జిల్లా ప్రధాన కార్యదర్శి.

TNR NEWS

సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి

Harish Hs