ముస్తాబాద్ మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహనలో భాగంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని వాహనదారులకు ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి బిజెపి నాయకులు యువకులు పాల్గొని హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల మండలంలో 25 సంవత్సరాల లోపు యువకులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని ఎస్సై గణేష్ తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని.బైక్‌పై వెళ్లినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ ధరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ రూట్‌లో ప్రయాణించరాదన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ బైక్‌పై, కారులో ప్రయాణం చేసేటప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలకు ముప్పు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి. పాక్స్ డైరెక్టర్ కరెట్ల కొండల్ రెడ్డి. కోల్ల కృష్ణ. సద్ది మధు తోట ధర్మేందర్. ఉచ్చిడి బాల్ రెడ్డి వరి వెంకటేష్. శీల ప్రశాంత్. మిడిదొడ్డి భాను. రంజాన్ నరేష్. తాళ్ల విజయ్. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.