మండలంలోని సర్వాపురం గ్రామానికి చెందిన బాసూజీ గంగారం అనే నాయకుడు చనిపోవడంతో ఆ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకర రవిశంకర్ శనివారం పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం లో చురుకుగా పనిచేసిన ఒక ఉద్యమకారుడు చనిపోవడం బాధాకరమని పార్టీకి తీరని నష్టమని అన్నారు. కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని ధైర్యం చెప్పినట్లు తెలిపారు. కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు ఆకుల నగేష్, తిరుపతి గౌడ్ రత్నాకర్ రెడ్డి ,భీమయ్య ,ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.