Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కొండపాకలోని సత్యసాయి సంజీవని ఆస్పత్రిని సందర్శించిన  – మాజీ మంత్రి హరీష్ రావు 

 

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లోని సత్యసాయి సంజీవని ఆస్పత్రిని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఆరు రోజుల్లో 18 మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేసిన సత్య సాయి ఆస్పత్రి సేవలు ప్రసంశనీయం అని అన్నారు. సత్యసాయి ఆస్పత్రి సేవలను దేశంలోని 10వేల గ్రామాల్లోని చిన్నారులకే కాకుండా, 18 ఇతర దేశాల్లోని పిల్లలకు కూడా అందుబాటులో ఉన్నాయి. గత 12 ఏళ్లలో 33,600 మందికి పైగా చిన్నారులకు సర్జరీలు నిర్వహించారు. పేద కుటుంబాల ఆవేదనలకు ఈ ఆస్పత్రి ముగింపు పలుకుతున్నది. అత్యాధునిక పరికరాలు, ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలతో దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నది అని అన్నారు. ప్రభుత్వాలు చేయలేని పనిని సత్యసాయి ట్రస్ట్ ఘనంగా చేసి చూపుతోంది. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు మన తెలంగాణలోనూ ఇలాంటి ఆస్పత్రి ఉండటం మన రాష్ట్ర ప్రజల అదృష్టం. మూడు లక్షల నుంచి పది లక్షల వరకు ఖర్చయ్యే గుండె ఆపరేషన్లను పేద కుటుంబాలకు ఉచితంగా అందించడం గొప్ప సేవ. ఇక్కడి వైద్యులు, సిబ్బంది సేవాస్పూర్తితో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సత్య సాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీ శ్రీనివాస్, మధుసూదన సాయి ని హృదయపూర్వకంగా అభినందించారు. వారిద్దరి నాయకత్వం వల్లే ఇలాంటి గొప్ప సేవా సంస్థలు సమాజానికి లభిస్తున్నాయి అని తెలిపారు. ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పిల్లలు గుండె సమస్యలతో జన్మిస్తుంటే, వారిలో కేవలం 10వేల మందికకి మాత్రమే అవసరమైన చికిత్స లభిస్తోంది. ఈ పరిస్థితుల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలు మరింత విస్తరించి, చిన్నపిల్లల ప్రాణాలు కాపాడాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఆస్పత్రి గుండె ఆపరేషన్లకే పరిమితం కాకుండా, ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలతో ప్రజలకు సేవ చేస్తోంది. కేవలం ఆరు రోజుల్లో 18 మంది పిల్లలకు సర్జరీలు పూర్తిచేసి, వారికి పునర్జన్మ ప్రసాదించడం గొప్ప విషయం అని అన్నారు.

ఇక్కడి వైద్యులు మనసుతో పని చేస్తూ మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ, తమ సేవలను పేద పిల్లల జీవితాలను కాపాడటానికి అంకితమిచ్చిన వైద్యులు నిజమైన దేవదూతలు అని కొనియాడారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం కూడా. ఇలాంటి గొప్ప సేవలను అందించినందుకు సత్య సాయి ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. సత్యసాయి ట్రస్ట్ సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొంటూ, ఈ సేవలను విస్తరించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబానికి చేరాలి అని అన్నారు.

Related posts

కోదాడ క్లస్టర్ ఉద్వాన విస్తరణ అధికారిగా రాజు

TNR NEWS

మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

TNR NEWS

*పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.*

Harish Hs

రామగుండం పోలీస్ కమీషనరేట్*రామగుండం పోలీస్ కమీషనరెట్ పోలీస్ ఏర్పాట్ చేసిన స్టాల్ సదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఏపూరి తిరపమ్మ సుధీర్..

TNR NEWS

జాన్ పహాడ్ ఉర్సు గంధం ఊరేగింపు ప్రారంభించిన మంత్రి

TNR NEWS