కులాంతర వివాహం చేసుకుందని అగ్రకుల దురహంకారంతో కానిస్టేబుల్ నాగమణిని తన సోదరుడు పరమేష్ కుల దురహంకార హత్య పాల్పడ్డాడు కావున తక్షణమే పోలీసులు అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం ఈ మేరకు కేవీపీఎస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం
మండలం రాయపోలు గ్రామానికి చెందిన కొంగరి నాగమణి అనే కానిస్టేబుల్ నవంబర్ 10న యాదగిరి గుట్టలో శ్రీకాంత్ అనే దళిత యువకుడిని కులాంతర వివాహం చేసుకుంద. నాగమణికీ తల్లి తండ్రి లేకపోవడం. ఆ కుటుంబానికి కొంత అస్తి ఉండటంతో తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆస్తి లో వాటా తీసుకుంటుందని నాగమణి తమ్ముడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తక్కువ కులం వాడిని పెళ్లిచేసుకుంటావా అంటూ డ్యూటీ కి వెళ్తున్న కానిస్టేబుల్ నాగమణి తోబుట్టువైన తన తమ్ముడు పరమేష్ కారుతో వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టి వేట కోడవలితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన అగ్రకులదురహంకారం తో జరిగింది. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సహo లేక పోవడంతో ఇలాంటి కులదురహంకారహత్యలు బహిరంగంగా జరుగుతున్నాయని అన్నారు.
గతంలో మిర్యాలగూడకు చెందిన మారుతి రావు తన బిడ్డ అమృత తక్కువ కులానికి చెందిన ప్రణయ్ ని పెళ్లి చేసుకుంటే అతికిరాతకంగా చంపాడు, అదే రూపంలో ఈరోజు నాగమణి తమ్ముడు పరమేష్ కూడా కులదురహంకార హత్యకు పాల్పడ్డాడు కేవీపీఎస్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ హత్యకు ప్రోత్సహించిన వారిని హత్య చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేవిపిఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దళితుడి వివాహం చేసుకున్నందుకు హత్య చేసిన పరమేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు హత్యానేరం కింద కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు నాగమణి భర్త శ్రీకాంత్ కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ శ్రీకాంత్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.