కోదాడ బిఆర్ యస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోదాడ పట్టణంలోని నిమ్మకాయల సెంటర్ వద్దగల డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోదాడ పట్టణ BRS పార్టీ అధ్యక్షుడు షేక్ నయీమ్ మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ప్రజలు స్వేచ్ఛగా సమానత్వంగా జీవించాలని రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలనే సదుద్దేశ్యంతో ఆయన ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచిస్తే, నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మానవ హక్కులకు విఘాతం కలిపిస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సామాన్య ప్రజలు ఏమి తినాలో, ఏమి తినకూడదో అని ఆంక్షలు పెట్టి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో అన్ని మతాల, అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో జీవించాలని అంబేద్కర్ గారు కోరుకుంటే ఈనాటి కేంద్ర ప్రభుత్వం మతోన్మాద దుష్టశక్తులు ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాగం సాక్షి దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాలు ఒకేతాటిపైకి వచ్చి మతోన్మాద దుష్ట పాలకులకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్, కౌన్సిలర్స్ మామిడి రామారావు, మేదర లలిత, మహిళా నాయకురాలు పిట్టల భాగ్యమ్మ, సంగిశెట్టి గోపాల్, కర్ల సుందర్ బాబు, చింతల లింగయ్య, చలిగంటి వెంకట్, చీమ శ్రీనివాసరావు, బచ్చలకూరి నాగరాజు, షేక్ అబ్బుబకర్, షేక్ ఆరిఫ్, జానిఆర్ట్స్, సిద్దెల రాంబాబు, గొర్రె రాజేష్, ధీకొండ కృష్ణ, మహ్మద్ షాకిర్, బీపీల్ జానీ, షేక్ నిజామ్,కె.లక్ష్మణ్, కలకొండ వెంకటనారాయణ, కుడుముల సైదులు తదితరులు పాల్గొన్నారు…….