గిరిజన గ్రామపంచాయతీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ జనరల్ మేనేజర్ ట్రైకార్ బి.రవికుమార్ అన్నారు.శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని గిరీనగర్ ప్రభుత్వ గిరిజన బాలికల వసతిగృహం భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాలలో భాగంగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. భగవాన్ బిర్సా ముండా 150 వ జయంతి సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధర్తీ అభ జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంను ప్రారంభించి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో 954 గిరిజన గ్రామ పంచాయతీలను ఎంపిక చేసిన గ్రామపంచాయతీలకు అన్ని వసతులు కల్పించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. సూర్యాపేట జిల్లాలోని 17 గిరిజన గ్రామ పంచాయతిలను ఎంపిక చేయడం జరిగిందని, ఇట్టి గ్రామాలలో 15 నవంబర్ 2024 నుండి 26 నవంబర్ 2024 వరకు గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ పంచాయతీలల్లో కల్పించవలసిన మౌలిక వసతుల గురించి చర్చించడం జరుగుతుందన్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో గ్రామపంచాయతీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.శంకర్, రిటైర్డు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎల్.పాండు నాయక్, కార్యాలయ పరిపాలన అధికారి పి.శాంతి కుమార్, వార్డెన్లు గిరిధర్ రెడ్డి, కవిత, ఝాన్సీ, రాణి, జూనియర్ అసిస్టెంట్లు ఎస్. శ్రీనివాసులు, వి.ప్రియాంక, కార్యాలయ సిబ్బంది శివరాజు, నాగరాజు, సైదా నాయక్, సైదులు, లింగా నాయక్, దేవ తదితరులు పాల్గొన్నారు.