రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నేడు రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు కూడా ఆయన చలవేనని పేర్కొన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని ముడిమ్యాల గ్రామంలో పీఎసీఎస్ చైర్మన్ గోనే ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గోనే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ కొందరి వాడు కాదని, ఆయన అందరివాడని అన్నారు. ఆయనను కొందరికి పరిమితం చేయడం సరైంది కాదన్నారు. అలాగే రావులపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ కేసారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాల కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి అంబేద్కర్ బాటలు వేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆ మహానుభావుని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడలలో నడవాలన్నారు. ఎమ్మెల్యే నివాళులర్పించిన కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, చేవెళ్ల పీఎసీఎస్ చైర్మన్ దేవర వెఉకట్ రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వీరెందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ బేగరి రాములు, అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు సున్నపు ప్రవీణ్, నాయకులు పడాల రాములు మరియు ముడిమ్యాల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాములు, మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ వాజీద్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కోశాధికారి వినోద్, మైనారిటీ నాయకులు యు వెంకటేష్ ఖాజామోహినొద్దీన్, యండీ హనీఫ్, యండీ ఫహీం, యండీ చాన్ పాషా, చిన్న ఖాజామియా, నాయకులు రాంచంద్రయ్య, బుర్ల మాణిక్యం, యు రవీందర్, బీరప్ప, చాకలి వెంకటేష్, ఎర్రవల్లి ప్రభాకర్, దుర్గేశ్, వై సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.