నర్సంపేట పట్టణంలోని ద్వారకపేటలో గల మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు గురుకుల ప్రిన్సిపాల్ శ్రీపాల తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి చెందిన మరియం, సభిహలు స్టేట్ లెవల్ ఆడుతున్నట్లు తెలిపారు. ఇటీవల వరంగల్ లో నిర్వహించిన అసోసియేషన్ గేమ్స్ అండర్-19 కబడ్డీ పోటీల్లో పాల్గొని గెలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీపాల మాట్లాడుతూ… రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధించాలని విద్యార్థులకు సూచించారు.