Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నూతనంగా సిబ్బంది ఎంపిక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఎత్తిపోతల ఉద్యోగాలను లక్షల్లో అమ్ముకుంటున్న ఏజెన్సీ నిర్వాహకులు.బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ

నాగార్జునసాగర్ ఎడమకాలపై గల లిఫ్ట్ ఎత్తిపోతల పథకాలలో ఎన్నో ఏళ్ల నుండి చాలీచాలని వేతనంతో వెట్టి చాకిరీ చేస్తున్న సిబ్బందిని యధావిధిగా కొనసాగించాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ,

గత 25 సంవత్సరాల నుండి ఎత్తిపోతల పథకాలలో పనిచేస్తున్న ఆపరేటర్లు లస్కర్లు వాచ్మెన్ లను యధావిధిగా కొనసాగిస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారి స్థానంలో ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నూతనంగా ఉద్యోగాలను భర్తీ చేసే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలని వారుఅన్నారు, ఎత్తిపోతల పథకాలను నమ్ముకుని చాలీచాలని వేతనంతో ఎంతోమంది సిబ్బంది పనిచేస్తున్నారని నేడు నూతనంగా ఏజెన్సీ ద్వారా నియామకాలు చేపడితే గతంలో పనిచేసిన పాత సిబ్బంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తుందని, కావున ప్రభుత్వం పాత సిబ్బందిని కొనసాగించాలని కోరారు, రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలలో పాత సిబ్బంది స్థానంలో నూతనంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయంతో, ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు ఇదే అదునుగా భావించి ఎత్తిపోతల పథకంలో పంపు ఆపరేటర్లు, లస్కర్లు, వాచ్మెన్ ల ఉద్యోగాల భర్తీకి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ పలువురి నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారని, మండల వ్యాప్తంగా అధికార పార్టీ నాయకుల కనుసనల్లో ఎత్తిపోతల ఉద్యోగాల కోసం లక్షల్లో చేతులు మారుతున్న నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రి ఏమీ తెలవనట్లు ప్రవర్తించడం సరికాదని, ఇలాంటి చర్యలు ఎత్తిపోతల పథకాల వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని భవిష్యత్తులో ఎత్తిపోతల పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు సైతం ఇచ్చే పరిస్థితి ఏజెన్సీ నిర్వాహకులకు ఉండదని కావున స్థానిక ఎమ్మెల్యే పద్మావతి మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే స్పందించి ఎత్తిపోతల పథకంలో పాత సిబ్బందిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవాలని లేనియెడల తాము పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు.

Related posts

అర్హత గల ప్రతీ వ్యక్తికి రేషన్ కార్డ్  – 40లక్షల కొత్త రేషన్ కార్డులిస్తాం.. – జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

TNR NEWS

రైస్ మిల్లుల కాలుష్యం నుండి ప్రజలను కాపాడాలి

Harish Hs

ఒక నిమిషం వేచి చూడు పోస్టర్ని ఆవిష్కరించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

TNR NEWS

ఈనెల 20న వేములవాడలో సీఎం రేవంత్ పర్యటన

TNR NEWS

జనవరి నుంచే సన్నబియ్యం పథకం: మంత్రి ఉత్తమ్

Harish Hs

TNR NEWS