అందోలు మండలం కన్‌సాన్‌పల్లి గ్రామంలోని దత్తాశ్రమంలో ఆదివారం ఘనంగా శ్రీ దత్తాత్రేయ జయంతి మహోత్సవాలు, 34వ వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి కృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో ద్వజారోహణం కార్యక్రమం, పుండరీకం మహరాజ్, అంజయ్య మహారాజ్, ఛాయ పఠ పాదుకపూజతో పాటు సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. కృష్ణాగౌడ్, సాయాగౌడ్, రాజా గౌడ్, వెంకటేశం గౌడ్, హరికృష్ణగౌడ్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దత్త జయంతిని భక్తుల మద్య ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కన్‌సాన్‌పల్లి, జోగిపేట, కేరూర్ బిజిలిపూర్, ఖాదిరాబాద్, మాసానిపల్లి, గడిపెద్దాపూర్, నాగుల పల్లి, మర్వెళ్లి గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. ఆయా గ్రామాలకు చెందిన భక్త మండలుల ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు నిర్వాహకులు కట్టరామా గౌడ్, భక్తులు సత్యనారాయణ గౌడ్, రమేశ్ ముదిరాజ్, లతో పాటు పలువురు పాల్గొన్నారు.
previous post