మునగాల మండలం రేపాల గ్రామం లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శరణు గోషతో మార్మోగింది. 18వ పడి నారి కాయల తోకల సైదులు గురుస్వామి 21వ తారీకు ఉదయం నిర్వహించిన గణేష్ హోమం అయ్యప్పస్వామి మండల దీక్ష ఇరుముడి కార్యక్రమం ఘనంగా జరిగింది.వేద పండితులు పలువురు అయ్యప్ప గురుస్వాములు ఇరుముడి కార్యక్రమం సాంప్రదాయ బద్ధంగా శాస్రోత్తంగా నిర్వహించారు.ప్రత్యేక వేదికపై అయ్యప్ప,గణపతి,సుబ్రమణ్య ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పంచామృత అభిషేకం నిర్వహించి అర్చన,అష్టోత్తర శతనావలి జరిపారు. ఇరుముడి కార్యక్రమానికి ప్రత్యేకంగా నిర్వహించిన 18వ పడి నారి కాయల తోకల సైదులు గురుస్వామి కర్పూర హరతులను వెలిగించి స్వాములకు హారతి ఇచ్చారు . అనంతరం స్వాములకు తీర్ద ప్రసాదాలు, అందజేశారు. అనంతరం స్వాములకి ఇరుముడి మూటను శిరమున దాల్చి శరణు ఘోష వేడుకుంటూ శబరిమల యాత్ర బయలుదేరారు ఈ సందర్భంగా తోకల సైదులు గురుస్వామి మాట్లాడాతూ.భక్తిభావం అలవర్చుకున్నప్పుడే శాంతియుత సమాజం నెలకొంటుందన్నారు. అయ్యప్ప మాల ధరించడం అంటే ఎన్నో జన్మ జన్మల పుణ్యఫలం అని అన్నారు.స్వామివారి ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో పీఠం గురుస్వామి సన్నాయిల సైదులు గురుస్వామి ,చిట్యాల మోహన్ రెడ్డి గురుస్వామి, రావులపెంట రమేష్ గురు స్వామి,పొనుగోటి రంగా గురుస్వామి, సారిక చిన్నరామయ్య గురుస్వామి, రావు శ్రీనివాస్ రెడ్డి గురుస్వామి, సారిక పెద్దరామయ్య స్వామి కన్నె స్వాములు కత్తి స్వాములు గంట స్వాములు గదాస్వాములు పేరుస్వాములు భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు