తెలంగాణ ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని చేవెళ్ల గ్రామాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో నిర్ణయించిన నేపథ్యంలో చేవెళ్ల మండలంలో ఉన్న అన్ని అర్హతలున్న మేజర్ గ్రామ పంచాయతీ ఆలూర్ ను, ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కలుపుతూ నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ గ్రామ అఖిలపక్షం నాయకులు సోమవారం ఎమ్మెల్యే కాలే యాదయ్యని తన స్వగ్రామమైన చించల్ పేట్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులతో ఎమ్మెల్యే చర్చించి, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ప్రజల అవసరాల దృష్ట్యా ఆలూర్ ను మండలం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని సానుకూలంగా స్పందించినట్లు అఖిలపక్షం నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన వారిలో కసిరే వెంకటేష్, కవ్వగూడెం నర్సిములు, తోట చంద్రశేఖర్, అశోక్, నరేందర్, శ్రీశైలం, షబ్బీర్, యస్ నర్సిములు, యాదిరెడ్డి, శేఖర్, సీహెచ్ నర్సిములు, శ్రీనివాస్, ఎస్ ప్రభాకర్, కుమార్, టీ ప్రభాకర్, మహేష్, మహేందర్, మోహన్, సునీల్, బెన్నీ తదితరులు ఉన్నారు.