సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి ఆదేశాలతో సీఎంఆర్ఎఫ్ చెక్కులను గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు అండగా భరోసా కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో హాస్పిటల్ లో వైద్యం చేయించుకొని వారు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా జాలిగామ గ్రామం తాళ్ల లావణ్య కు 60 వేల అదే గ్రామానికి చెందిన మంగలి అరుణ కు 60 వేల మరియు రాయగట్లపల్లి గ్రామానికి చెందిన సాయికుమార్ 60 వేల, వేములఘట్ గ్రామానికి చెందిన కవితకు 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, జగదేవ్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, నక్క రాములు, శివారెడ్డి, రమేష్ గౌడ్, అజ్గర్, అంజి, ముదిరాజ్ ఉపేందర్, అరుణ్, డప్పు గణేష్, శ్రావణ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
previous post
next post