Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి మతోన్మాదుల నుండి దేశాన్ని రక్షించుకోవాలి  వామపక్ష పార్టీలు డిమాండ్

సూర్యాపేట:రాజ్యాంగ నిర్మా త అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అవమానకరవ్యాఖ్యల బాధాకరమని, తక్షణమే ఆయనను మంత్రివర్గంలో నుండి బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి , న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ , సిపిఐ జిల్లా నాయకులు దంతాల రాంబాబు, ఎం సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్నడిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై అమిత్ షా అహంకారపూరితమైన ,తిరస్కార స్వరంతో అమిత్ షా మాట్లాడడం తన అహంకారాన్ని రుజువు చేసిందన్నారు. భారతదేశ లౌకిక , ప్రగతిశీల రాజ్యాంగ రూపశిల్పి పైన చూపిన అగౌరవాన్ని, అపహాస్యం చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఈ అవమానకరమైన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలనిడిమాండ్ చేశారు.

ఈ వ్యాఖ్యలు కేవలం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పైన చేసినవి మాత్రమే కాదని,సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్న లక్షలాది మంది అణగారిన వ్యక్తులకు జరిగిన అవమానమన్నారు .తక్షణమే అతన్ని బర్తరఫ్ చేయాలన్నారు.

భారత రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడికి వ్యతిరేకంగా భారత ప్రజల నుంచి పెరుగుతున్న ప్రతిఘటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారన్నారు .డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ హిందూత్వ శక్తులచే నిరంతరం దాడికి గురవుతున్న భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన నిశ్చయాత్మక చర్యల నిబంధనల పరిరక్షణ కోసం పోరాడటానికి లక్షలాది మందిని ప్రేరేపించారని చెప్పారు. భారత ప్రజలపై మనువాద భావజాలాన్ని రుద్దేందుకు ఈ శక్తులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు.

అమిత్ షా , బిజెపి పార్టీ వారి ఆలోచనలు కులతత్వంతో ఉన్నాయని, రాజ్యాంగం పట్ల నిజమైన గౌరవం లేదని ,ఇది మరోసారి రుజువయిందన్నారు.

ఎన్నికల సమయంలోనే కాకుండా ఆర్‌ఎస్‌ఎస్ ,బిజెపి తరచుగా వ్యక్తం చేసే అసహనం, భారతదేశంలో సామాజిక న్యాయం , సమానత్వం కోసం డాక్టర్ అంబేద్కర్ పోరాడి నడిపిన ఉద్యమాలు , ఆదర్శాల పట్ల వారి లోతైన ద్వేషాన్ని వెల్లడిస్తుందన్నారు. మతోన్మాదుల నుండి దేశానికి ప్రమాదం పొంచి ఉందని అమిత్ షా విద్వేషాలకు కారకుడని విమర్శించారు. తక్షణమే అమిత్ షా ను బర్తరఫ్ చేయాలని చేసే వరకు వామపక్ష పార్టీలుఉద్యమాలను కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలోసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు , కో లిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంట నాగయ్యఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలే బోయిన కిరణ్ ,జిల్లా అధ్యక్షుడు సింహాద్రి ,పి వై ఎల్ జిల్లా కోశాధికారి బండి రవి, పి డి ఎస్ యు డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్ ,ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పోరండ్ల దశరథ ,దండి ప్రవీణ్, మందడి శ్రీధర్, ఓంకార్, మల్లారెడ్డి, దూదిపాల ప్రవీణ్ వేణు, సిపిఐ పట్టణ నాయకులు గాలి కృష్ణ, ఎం సిపిఐ యూ జిల్లా నాయకులు ఏపూరి సోమన్న, సిపిఎం నాయకులు వీరబోయిన రవి, ఎం రాంబాబు, చిన్న పంగ నరసయ్యతదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆరుగ్యారెంటీల పేరుతో ప్రజలను ఆగం చేసిండ్లు* – ఏడాది కావస్తున్నా ఇచ్చిన హమీలు అమలు చేయలే – పథకాల అమలులో మ్యానీఫెస్టో కమిటి చైర్మన్‌ విఫలం – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

TNR NEWS

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది

TNR NEWS

బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవు

TNR NEWS

యువత మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్‌ బెట్టింగులకు దూరంగా ఉండాలి

TNR NEWS

ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి  ఎస్సై విజయ్ కొండ

TNR NEWS

డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

TNR NEWS