ముస్తాబాద్ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాల యజమాన్యం తన ఎస్బిఐ వినియోగదారుల సేవా కేంద్రంలోనే దర్జాగా పాఠ్యపుస్తకాలు వ్యాపారం. చేస్తున్నారని ఏ ఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుర్ర రాకేష్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులతో కలిసి పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న సేవా కేంద్రం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవేట్ పాఠశాల యజమాన్యం తన సొంత ఇంట్లో పాఠశాల నడుపుతూ అనుమతులు లేకుండా ఓ సేవా కేంద్రంలో పాఠశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు బుక్కులు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడని.
సంబంధిత విద్య అధికారులు వెంటనే
స్పందించి పాఠశాలను యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆని
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుర్ర రాకేష్ డిమాండ్. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెతుకు అజయ్, నాయకులు అభి పాల్గొన్నారు.