కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు నూతన సంవత్సరం రోజున ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తీసుకువచ్చి ఎమ్మెల్యే చేతుల మీదుగా పేద విద్యార్థులకు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను టీటీడీ నుంచి తెప్పించిన ప్రత్యేక శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, వంగవీటి రామారావు, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ఎర్నేని బాబు,పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కేఎల్ఎన్ ప్రసాద్, పైడిమర్రి వెంకటనారాయణ,లారీ అసోసియేషన్ సెక్రటరీ ఎలగందుల నరసయ్య, బాబా, తరుణ్ తదితరులు పాల్గొన్నారు…….
previous post