స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ గా ఓయూ ప్రొఫెసర్ నారా కిషోర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని రామానంద తీర్థ గ్రామీణ సంస్థ లో శుక్రవారం ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. పదవి స్వీకారోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఓయూ పూర్వ విద్యార్థులు పర్శరాములు, ప్రేమ్ కుమార్, మంగన్న, కోటి రెడ్డి, ఎల్ రాంరెడ్డి, బండ నర్సింలు, డీ చంద్రయ్య హాజరై కిషోర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సంస్థ చైర్మన్ గా నియమించిన సిఎం రెవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తనకిచ్చిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తిస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తానని ప్రకటించారు. సంస్థ ఇచ్చే శిక్షణ తరగతులను పేద నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.