తపాలా శాఖ జీవిత బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జీవిత బీమా అభివృద్ధి అధికారి జింజిరాల సైదులు అన్నారు. మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్ వారు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న గ్రామీణ తపాలా జీవిత భీమా మరియు తపాలా జీవిత బీమా పాలసీల గురించి ఆర్పిఎల్ఐ పి ఎల్ ఐ మహా ర్యాలీ నిర్వహించినారు. ఈ ర్యాలీలో గ్రామ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న గ్రామీణ తపాలా జీవిత భీమా మరియు తపాలా జీవిత బీమా పాలసీలు వాటి యొక్క లాభాలు మరియు ఇన్సూరెన్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించినారు ఇట్టి గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలు పూర్తి గవర్నమెంట్ ద్వారా అందిస్తున్నటువంటి ప్రజలకు ఉపయోగకరమైన పాలసీలు ఇట్టి పాలసీలో చేరిన వారికి అత్యధికమైన బోనస్ మరియు ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ద్వారా కల్పించబడుతుంది ఇట్టి పాలసీలలో ప్రీమియం తక్కువగా ఉండి బోనస్ ఎక్కువగా ఉంటుంది మరియు దురదృష్టవశాత్తు ఎలాంటి మరణం సంభవించిన నూ వారికి పాలసీ విలువలతో పాటు బోనస్ కూడా చెల్లించబడును కావున ఇట్టి అవకాశాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో మునగాల ఎస్పీఎం దయాకర్, కొక్కిరేణి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బ్లాస్టర్ నరహరి, సనీల్, మునగాల సబ్ పోస్ట్ ఆఫీస్ అన్ని గ్రామాల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
![](https://tnrnews.in/wp-content/uploads/2025/01/1000503111-960x720.jpg)
next post