ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి దినపత్రికలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అన్నారు. సుధీర్ చేతుల మీదుగా గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అలాగే డి పి ఆర్ ఓ కార్యాలయాలలో రాజముద్ర తెలుగు దినపత్రిక 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ ను వికారాబాద్ జిల్లా రాజముద్ర తెలుగు దినపత్రిక ప్రతినిధి శ్రీనివాస్ సమక్షంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రికలని, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేయడంలో పత్రికల పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైందని, వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు. ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాసి నిజ నిజాలను నిగ్గు తీర్చాల్సిన అవసరం పాత్రికలపై ఉందన్నారు.వార్తల సేకరణలో ముందుంటూ నిత్యం ప్రజలకు అన్ని విషయాలను వేగంగా చేరవేస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ సమాజ శ్రేయస్సు కోరి వివిధ విభిన్న కథనాలను ప్రచురిస్తూ ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహను కలిగించేలా కృషి చేస్తూ సమ సమాజ నిర్మాణానికి పాటుపడుతున్న రాజముద్ర తెలుగు దినపత్రికు ప్రతి సంవత్సరం ప్రజల ఆదరణను పెంపొందించుకుంటూ పోతున్న మాదిరిగానే ఈ సంవత్సరం 2025 పత్రిక రంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రజా ఆదరణతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ రాజముద్ర పాఠకులకు అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.రాజముద్ర తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా వివిధ పత్రికల పాత్రికేయులు ఆనంద్, బాలయ్య, అరుణ్, కృష్ణ డి పి ఆర్ ఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.