సూర్యాపేట:రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వివిధ వృత్తులలో పనిచేస్తున్నారని వారి సంక్షేమాన్ని తుంగలోకి తొక్కే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలు సరైనవి కాదని సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు ప్రభుత్వాలను హెచ్చరించారు. శనివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆల్ ఇండియా సిఐటియు ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడెల వల్ల రానిన రోజుల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో కోడులను అమలు చేయాలని చూస్తే కార్మికులు పోరాటానికి సిద్ధమవుతారని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో వివిధ రూపంలో వెల్ఫేర్ బోర్డు మార్పులను చేస్తూ బోర్డు నిధులను విచ్చలవిడిగా అప్డేట్ పేరుతో ఖర్చు చేస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, రాష్ట్రంలో నూతన విధానాన్ని తీసుకొచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సంక్షేమ పథకాల దరఖాస్తులకు నిధులు తక్షణమే విడుదల చేయాలని, ప్రమాదంలో మరణించిన కార్మికునికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు మేటర్నిటీ మ్యారేజ్ దహన సంస్కారాలకు ఇచ్చే 30 వేలను లక్ష రూపాయలకు పెంచాలని, 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి 6000 రూపాయలు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు వంగూరు రాములు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రామ్మోహన్ రావు, ఆర్ కోటంరాజు ,వర్కింగ్ ప్రెసిడెంట్ ముదం శ్రీనివాస్ ,కోశాధికారి యల్క సోమయ్య గౌడ్, సిహెచ్ లక్ష్మీనారాయణ, అనంతల మల్లయ్య, సోములు ,లక్ష్మయ్య, ఉప్పలయ్య ,గాలయ్య, జంగయ్య, సాగర్ ,రాములు, నాగేశ్వరరావు ,రమేష్ ,బాలాజీ నాయక్ ,రాజేశ్వరి ,సుజాత, మంజుల తదితరులు పాల్గొన్నారు.