నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే అని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు.గురువారం మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామ శివారులో జాతీయ రహదారి 65 కి ప్రక్కన ఉన్న శ్రీకృష్ణ హోమ్స్ కాలనీ నందు కాలనీ వాసులు 2 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాల ను డీఎస్పీ ప్రారంభించారు.అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. సమాజంలో దోపిడీలు దొంగతనాలు హత్యలు ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు నేర నియంత్రణ చేసేందుకు మరియు నేరస్తులను పట్టించేందుకు సీసీ కెమెరాలు ఎంత గానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ నివాసాల ముందు వ్యాపార సంస్థల ముందు కాలనీలో తమ రక్షణ కోసం తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మరియు జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సహకారం అందించాలని వారు సూచించారు.శ్రీకృష్ణ హోమ్స్ నందు నేరాల నివారణ కోసం కాలనీవాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు వారిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్,సాగర్ ఎడమ కాలువ కమిటీ మాజీ చైర్మన్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మునగాల ,శ్రీకృష్ణ హోమ్స్ కాలనీ అధ్యక్షుడు విలాస కవి రమేష్ రాజ్, కాలనీ కమిటీ సభ్యులు కత్తి వెంకటేశ్వర్లు, సత్తార్ రాయపి రెడ్డి, శ్రీరామ్ భాస్కర్, గోపతి ఉపేందర్, గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post