Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

డ్రగ్స్ సైబర్ నేరాల పైన అవగాహన

సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు సోమవారం కోదాడ టౌన్ సీఐ రాము కోదాడ పట్టణంలోని కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల లో షీ టీమ్స్ మరియు సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సందర్భంగా సీఐ రాము మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అధ్వర్యంలో సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ATM కార్డ్ వివరాలు,OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని
వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చే అటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తు మందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు.యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు.సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు.
అనంతరం పోలీసు కళా బృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హధస్సా రాణి,వైస్ ప్రిన్సపల్ అప్పారావు,ఆపరేషన్ స్మైల్ టీం ఎస్సై లింగయ్య,కోదాడ షీ టీం ఏఎస్ఐ కృష్ణమూర్తి, షీ టీం సిబ్బంది కానిస్టేబుల్ యాకూబ్,షీ టీం మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి,ఆపరేషన్ స్మైల్ సిబ్బంది వీరబాబు,SK మీరా CWC,పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ యల్లయ్య, గోపయ్య గురులింగం, ఈశ్వర చారి, కృష్ణ, నాగార్జున, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

Related posts

ఘనంగా సెమీ క్రిస్మస్ శాంతి సంతోషాలకు చిహ్నం క్రిస్మస్

TNR NEWS

తెలంగాణాలో సూర్యుడు భగ.. భగ..

TNR NEWS

ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దు .. అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్

TNR NEWS

సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించి పలు సూచనలు చేసిన-రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS

పోలీసు ప్రజా భరోసా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

TNR NEWS

ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

Harish Hs