ఎంజే ఎఫ్ బలోపేతానికి మాదిగ జర్నలిస్టుల కృషి చేయాలని ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు పడిశాల రఘు అన్నారు. బుధవారం కోదాడ నియోజకవర్గ ఎం జె ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
కోదాడ పట్టణంలో స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తోటపల్లి నాగరాజు అధ్యక్షతన ఎం జె ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.మాదిగ జర్నలిస్టులపై దాడులకు దిగిన కులం పేరుతో దూషించిన అందరం ఒకే కలిసికట్టుగా న్యాయం జరిగే వరకు పోరాడాలని అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలలో తప్పనిసరిగా మాదిగ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.అనంతరం కోదాడ నియోజకవర్గ ఎం జె ఎఫ్ నూతన అధ్యక్షునిగా చెరుకుపల్లి శ్రీకాంత్ ఉపాధ్యక్షులుగా చీమ చంద్రశేఖర్,మాతంగి సురేష్, ప్రధాన కార్యదర్శి తమలపాకుల లక్ష్మీనారాయణ , కోశాధికారిగా మందుల రాంబాబు,సహాయ కార్యదర్శిగా ,కుడుముల శివ, ఎంజెఎఫ్ కోదాడ ప్రచార కమిటీ కార్యదర్శి ఏపూరి సునీల్ రత్నాకర్ ,ఉపాధ్యక్షులుగా కలకొండ బుచ్చి రాములు కార్యదర్శిగా నేలమర్రి శ్రీకాంత్ గౌరవ సలహాదారులుగా బంక వెంకటరత్నం ,తోళ్ల గురునాథం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన కమిటీకి రాష్ట్ర నాయకులు పడిశాల రఘు నియామక పత్రాలను అందజేశారు అనంతరం నూతన కమిటీని పూలమాల సాలువులతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆళ్ళూరు చరణ్ , సుజన్ సుజిత్,సన్నీ డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.